అనుపమ ప్రేమలో పడిందా..?

19 Feb, 2020 08:20 IST|Sakshi
అనుపమపరమేశ్వరన్‌

వయసులో ఉన్న అమ్మాయిలు ప్రేమలో పడడం సహజం. అయితే ఆ విషయాన్ని కొందరు బయటపెడతారు మరికొందరు చెప్పడానికి భయపడతారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఎక్కడ తమ ఇమేజ్‌ పడిపోతుందోనన్న భయంతో బయట పడరు. అయితే దాన్ని ఏదోవిధంగా ఎక్స్‌ప్రెస్‌ చేస్తారు. నటి అనుపమపరమేశ్వరన్‌ ఈ కేటగిరికి చెందినదేననిపిస్తోంది. ప్రేమమ్‌ చిత్రంతో కథానాయికలుగా పరిచయమైన భామల్లో ఈ బ్యూటీ ఒకరు. ఆ తరువాత తెలుగులో ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు చిత్రాల్లో నటిస్తోంది. అలా కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా కొడి చిత్రంలో పరిచయమై మంచి విజయాన్నే అందుకుంది. అయినా ఆ తరువాత తమిళ తెరపై కనిపించలేదు. అయితే ఈ అమ్మడు అభిమానులతో తరచూ ఇన్‌ట్రాక్ట్‌ అవుతుంటుంది. ఇన్‌స్ట్ర్రాగామ్‌లో వారితో టచ్‌లో ఉంటుంది.

చదవండి: మేం విడిపోవడానికి కారణం తనే: హీరో

కాగా సినీ వర్గాలతో పాటు, అభిమానులు నటి అనుపమ పరమేశ్వరన్‌కు హ్యాపీ బర్త్‌డే శుభాకాంక్షలు కురిపుస్తున్నారు. అయితే మంగళవారం నటి అనుపమ పరమేశ్వరన్‌ పుట్టినరోజు. ఈ విషయాన్ని ఈ కేరళ కుట్టి తన ట్విట్టర్‌లో పేర్కొంది. అంతేకాదు పనిలో పనిగా తన వయసు 24 అని కూడా చెప్పేసింది. కాగా ఈమె తమిళంలో నటించిన కొడి చిత్రంలోని ఏయ్‌ సుళలీ అనే పాట మంచి హిట్‌ అయ్యింది. అనుపమకు మంచి పేరు తెచ్చి పెట్టింది. కాగా ఇంతకుముందు ఆ పాటకు ఈ ముద్దుగుమ్మ డాన్స్‌ చేసిన టిక్‌ టాక్‌ విడియోను విడుదల చేసింది. ఇప్పుడా పాటను అభిమానులు ఆమె పుట్టిన రోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా రష్మిక వంటి సహ నటీనటులు అనుపమకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

చదవండి: ‘నాన్న చనిపోతే పెద్దగా బాధ పడలేదు’

మరో విషయం ఏమిటంటే అనుపమపరమేశ్వరన్‌ మరో ఫొటోను తన ఇన్‌స్ట్ర్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. ఒక వయసైన దంపతుల జంట సముద్రతీరంలో కూర్చుని హాయ్‌గా ఎంజాయ్‌ చేస్తున్న ఫొటో అది. ఆ పక్కనే నువ్వు నేను అందమైన ప్రేమజంట కపుల్స్‌ గోల్స్‌ అనే ట్యాగ్‌ను పోస్ట్‌ చేసింది. దీంతో నటి అనుపమ ప్రేమలో పడిందని, ఆ విషయాన్ని ఇలా చెప్పకనే చెప్పిందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇకపోతే ఈ అమ్మడు తమిళంలో కొడి చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు. అలాంటిది చాలా గ్యాప్‌ తరువాత ఈ అమ్మడు కోలీవుడ్‌లో ఒక చిత్రంలో నటిస్తోంది. ఆర్‌.కన్నన్‌ దర్శకత్వంలో అధర్వకు జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. త్వరలోనే చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ను పరిచయం చేయనున్నట్లు ఈ చిత్ర వర్గాలు తెలిపారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా