'అనుభవించానుగా.. చెప్పాలనిపిస్తోంది'

7 Nov, 2015 09:08 IST|Sakshi
'అనుభవించానుగా.. చెప్పాలనిపిస్తోంది'

లాస్ ఎంజిల్స్: గృహహింస విషయంలో తన అభిప్రాయాలు చెప్పడం మిగితా వారికంటే తనకే ఎక్కువ బాధ్యతగా అనిపిస్తుందని ప్రముఖ హాలీవుడ్ నటి హల్లే బెర్రి అన్నారు. ఎక్స్ మెన్ సిరీస్ చిత్రాల్లో వరుసగా నటించిన ఆమె తాను కూడా గృహహింస బాధితురాలినని చెప్పారు. తాను గతంలో లివింగ్ రిలేషన్ కొనసాగించిన ఓ బాయ్ ఫ్రెండ్తో తనకు ఇదే సమస్య వచ్చిందని, తాను ఎదుగుతున్న క్రమంలో తన తల్లి కూడా దీనికి బాధ్యురాలవడం చూశానని అన్నారు.

'నా తల్లి గృహహింసకు గురవడం నేను కళ్లారా చూశాను. ఆ సంఘటనలు నన్ను ఏళ్ల తరబడి వెంటాడాయి. కానీ అప్పుడు నిస్సహాయురాలిని. ఆ తర్వాత కచ్చితంగా ఈ విషయంలో ఏదో ఒకటి చేసి నాతల్లిని విముక్తి చేయాలని అనుకున్నాను. కానీ వాస్తవంలో అలా జరగలేదు. చివరికి నేను కూడా అనుభవించాల్సి వచ్చింది. అందుకే, అవన్నీ ఇప్పటికీ నా మనసులో వెంటాడుతున్నాయి. అందుకే మహిళా లోకానికి నావంతుగా సహాయం చేయదలుచుకున్నాను. గృహహింసకు పాల్పడుతున్న వారి విషయంలో సహనంగా మాత్రం ఉండకూడదు. కొంతమంది మాత్రం ఈ విషయంలో ఎంతో సహానంతో భరిస్తుండటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది' అంటూ చెప్పుకొచ్చింది ఈ ఆస్కార్ అవార్డు విజేత.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి