ట్రక్కుతో చిక్కు తప్పెన్‌

11 Aug, 2018 00:22 IST|Sakshi
జాకీ చాన్‌

చైనా యాక్షన్‌ సూపర్‌ స్టార్‌ జాకీ చాన్‌ అంటే యాక్షన్‌ సినిమా ప్రియులందరికీ ఇష్టమే. ఎందుకంటే ఎంతో రిస్కీ స్టంట్స్‌ని కూడా అవలీలగా స్క్రీన్‌ మీద చేసేస్తారు. కానీ స్క్రీన్‌ వెనక ఆ స్టంట్స్‌ కోసం ఎంత సాహసానికైనా రెడీ అంటారు. ఈ ప్రక్రియలో ఎన్నోసార్లు ఒళ్లు జల్లెడ అయిపోయేలా దెబ్బలు తగిలించుకొన్నారు. కొన్నిసార్లు ప్రాణం మీదకు కూడా తెచ్చుకున్నారు. ఆయన శరీరం మీదున్న ప్రాక్చర్స్‌ అయితే లెక్క లేనన్ని. తాజాగా ‘ప్రాజెక్ట్‌ ఎక్స్‌’ అనే సినిమాలో యాక్ట్‌ చేస్తున్నారు జాకీ. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఫేమ్‌ జాన్‌ సేనా కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈసారి కూడా ఓ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారట జాకీ చాన్‌.జాకీ మాత్రమే కాదు మొత్తం చిత్రబృందం  ‘మడ్‌స్లైడ్‌’ (మట్టి దానంతట అదే కుదించుకుపోయే ప్రకృతి వైపరీత్యం) నుంచి తప్పించుకున్నారట. ఈ విషయాన్ని జాకీ పంచుకుంటూ – ‘‘లొకేషన్‌లో షూటింగ్‌ చేస్తుండగా వాతావరణంలో మార్పు వచ్చేసి మట్టి కుదించుకుపోవడం స్టార్ట్‌ అయింది. మా ప్రొడక్షన్‌ ట్రక్కులన్నీ అందులో చిక్కుకుపోయాయి. మా టీమ్‌ అంతా భయపడిపోయాం. ఇంతలో పెద్ద ట్రక్‌ వచ్చి మమ్మల్ని కాపాడింది. వాళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అనుభవం వల్ల మాకో పాఠం బోధపడింది. వాతావరణ పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని తెలిసింది’’ అని పేర్కొన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రియాంక-నిక్‌ల పెళ్లి ఫోటోలతో భారీ ఆదాయం..!

టైగర్‌తో లంచ్‌..

ప్రముఖ నిర్మాతకు మాతృవియోగం

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మొదలైంది.. ప్రభాస్‌, రానాల సందడి!

‘మహర్షి’ డిజిటల్‌ రైట్స్‌.. తెలిస్తే షాకే‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బరువు తగ్గే ప్రయత్నంలో నటి!

‘సర్కార్‌’లో విజయ్‌ చెప్పినట్టే చేస్తున్నాం..!!

దీప్‌వీర్‌ పెళ్లి హంగామా

ప్రేమానురాగాల సమ్మేళనం

హలో వరల్డ్‌

అమ్మ ఆశీర్వాదం