వీడియో చూసి ఏడ్చేశాను: జాక్వెలిన్‌

18 Oct, 2019 18:26 IST|Sakshi

భూమ్మీద ప్రేమకు, అనుబంధానికి మించిన అమూల్యమైంది ఏదీ లేదు. అయితే ఆ ప్రేమలో అత్యున్నత స్థాయి తల్లిదే. ఆ తరువాత అంతటి ప్రేమను పంచేది సోదరులే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దానికి తార్కాణమే ఈ వీడియో. నిజానికి ఈ వీడియో సోషల్‌ మీడియాలో ఎప్పుడో చక్కర్లు కొట్టింది. అయితే దీనిని తాజాగా హాలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌  తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దీంతో మరోసారి ఈ వీడియో వార్తల్లో నిలిచింది. ‘తోబుట్టువుల ప్రేమను మించింది ఏదీ లేదు’ అనే క్యాప్షన్‌తో విల్‌ స్మిత్‌ ఈ వీడియోను షేర్‌ చేశారు.

ఈ వీడియోలో చిన్న పిల్లవాడు తన చెల్లెతో కలిసి బాస్కెట్‌ బాల్‌ ఆడుతుంటాడు. చెల్లెతో బంతిని బాస్కెట్‌లో వేయమని చెప్పగా మొదటి ప్రయత్నంలో ఆమెకు ఆ బంతి గోల్‌ మిస్‌ అవుతుంది. దీంతో చిన్నారి ఏడుపు లంకించుకోవడంతో అన్న తనను హత్తుకొని మళ్లీ ప్రయత్నించమని దైర్యం చెప్తాడు. అంతేగాక తనను ఎత్తుకొని మరి మళ్లీ ఆమె బాస్కెట్‌లో బంతి వేయడానికి సహాయపడతాడు. ఈసారి బంతి సరిగా బాస్కెట్‌లో పడటంతో చిన్నారి ఆనందంతో మునిగి తేలుతుంది.  కాగా వీడియోను ఇప్పటికే కొన్ని లక్షలమంది వీక్షించగా అనేకమంది నెటిజన్లు తమకు ఓ అన్నయ్య ఉంటే బాగుండు అని భావోద్వేగంతో కామెంట్‌ పెడుతున్నారు. వీరే గాక వీడియో చూసిన నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కూడా దీనిపై స్పందించారు. వీడియో చూశాక నాకు ఏడుపు వచ్చింది అంటూ.. కామెంట్‌ పెట్టారు. 

Nothing beats that sibling love :-) 📹 @sarahanne_n_clan

A post shared by Will Smith (@willsmith) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా