వేధించేవాళ్లు ప్రతిచోటా ఉన్నారు

26 Oct, 2018 02:57 IST|Sakshi
జాక్వెలిన్‌ ఫెర్నాండజ్‌

‘‘మీటూ ఉద్యమం వల్ల ఎప్పుడో చర్చించాల్సిన లింగ విభేదాలకు సంబంధించిన అంశం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం’’ అన్నారు జాక్వెలిన్‌ ఫెర్నాండజ్‌. తాజాగా ఈ భామ కూడా ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు పలికారు. ఈ విషయం గురించి జాక్వెలిన్‌ మాట్లాడుతూ – ‘‘మీటూ’ ఉద్యమాన్ని కేవలం సినిమా ఇండస్ట్రీకే పరిమితం చేయొద్దు. మన సమాజంలో చర్చించాల్సిన అతి ముఖ్యమైన అంశం. లైంగికంగా వేధించేవాళ్లు కేవలం ఏ ఒక్క ఇండస్ట్రీలోనో కాదు ప్రతీచోట ఉన్నారు. కొన్నిసార్లు మన ఇళ్లల్లో కూడా. అలాగే ‘మీటూ’ ఉద్యమం మొదలైన ఉద్దేశం నుంచి పక్కదోవ పట్టకూడదు. సీరియస్‌గా ఉంటేనే ఉద్యమం అంతిమ లక్ష్యం చేరుకోగలం. కేవలం పని ప్రదేశాల్లో సురక్షితమైన వాతావరణం తీసుకురావడమే కాదు.  ప్రతీ చోటు స్త్రీకి సురక్షితంగా ఉండేలా చేద్దాం’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు