ఇదే నా మొదటి డిజిటల్‌ కవర్‌ ఫోటో..‌

3 May, 2020 12:55 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న వేళ బాలీవుడ్‌ ప్రముఖులు స్వీయ నిర్భంధానికి పరిమితమైన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాక్వలిన్‌ ఫెర్నాండేజ్ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా జాక్వలిన్‌ ఓ తెల్లని గుర్రంతో పోజ్‌ ఇస్తున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ఇది నా మొదటి డిజిటల్‌ కవర్‌ ఫోటో చూడండి’ అని కామెంట్‌ కూడా జత చేశారు. ప్రస్తుతం జాక్వలిన్‌ షేర్‌ చేసిన ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. (‘గతంలో ఎప్పుడూ చూడని విధంగా జాక్వలిన్‌’)

ఈ ఫోటోలో కనిపిస్తున్నగుర్రం సల్మాన్‌ ఖాన్‌ ఫామ్‌హౌజ్‌లోనిది. జాక్వలిన్‌ షేర్‌ చేసిన ఫోటో ‘హార్పర్స్ బజార్’ ఫ్యాషన్‌ మేగజైన్‌ మే ఎడిషన్‌కు సంబంధించిన కవర్‌ ఫోటో. మేగజైన్‌ కవర్‌ ఫోటో షూట్‌ చేయడానికి తన స్నేహితుడు సాజన్‌ సింగ్‌ సాయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. సాజన్ సింగ్‌ ‌ కొరియోగ్రాఫ్‌ర్‌గా, డాన్స్‌ ఇండియా డాన్స్‌లో పాల్గొన్న పోటీదారుగా అందరికి సుపరిచితమే. (టాప్‌లో 3 ఇడియట్స్‌!)

‘లాక్‌డౌన్‌ సమయంలో నాకు చాలా విషయాలు అనుభవంలోకి వచ్చాయి. కరోనా వైరస్‌ బాధ గురించి ఆలోచిస్తే.. ఈ మహమ్మరి చాలా మందికి ఇబ్బంది కలిగిస్తోందని తెలుస్తోంది. ప్రసుతం నేను ఫామ్‌హౌజ్‌లో సురక్షితంగా ఉన్నాను. ఇక్కడి నుంచి అవసరమైన వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ క్లిష్ట సమయంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి వైరస్‌ను ఎదుర్కొనే బలం, ఆరోగ్యం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను’ అని జాక్వలిన్‌ పేర్కొన్నారు. జాక్వలిన్‌ ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌కు చెందిన పన్వెల్ ఫామ్‌హౌస్‌లో సెల్ఫ్‌ క్వారంటైన్‌కు పరిమితమైన విషయం తెలిసిందే.‌ జాక్వలిన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘మిసెస్‌ సీరియల్‌ కిల్లర్‌’ చిత్రం డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో నిర్మించారు. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (‘నాకు కరోనా రాలేదు.. వచ్చింది మలేరియా’)

Head over to @bazaarindia to check out my first digital cover!!! 💛💛 📸@saajan_singh23

A post shared by Jac’kill’ine Fernandez (@jacquelinef143) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా