మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

19 Jul, 2019 16:48 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’  సినిమాలో జగపతిబాబు నటించడం లేదని సోషల్‌ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మహేష్‌, జగపతి బాబు మధ్య విభేదాల కారణంగానే ఆయన సినిమా నుంచి తప్పుకున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం  తెలుగు సినీపరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై జగపతిబాబు స్పందించారు. తనకు మహేష్‌తో  ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని.. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశారు.

ఈ మేరకు శుక్రవారం ఆయన సోషల్‌ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ‘సినీ పరిశ్రమ అనేది నాకు కుటుంబంతో సమానం. వారి గురించి మాట్లాడటం సరికాదు. కానీ నాపై వస్తున్న తప్పుడు కథనాల మూలంగా 33 ఏళ్ల సినీ జీవితంతో తొలిసారి వివరణ ఇస్తున్నా. మహేష్‌ బాబు సినిమా నుంచి నన్ను తప్పించారంటూ వార్తలు వస్తున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలు. మహేష్‌ సినిమా కోసం రెండు చిత్రాలను కూడా వదులుకున్నాను. ఈ క్యారెక్టర్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ నాకు చేయాలని ఉంది. కానీ కొన్ని అనుకోని సంఘటన మూలంగా ఆ చిత్రంలో నటించడం కుదరటంలేదు. సోషల్‌ మీడియాలో వస్తున్నదంతా అసత్యం. మహేష్‌కి, చిత్ర యూనిట్‌కి ఆల్‌ ద బెస్ట్‌’’ అంటూ జగపతిబాబు వివరణ ఇచ్చారు. అయితే జగపతిబాబు స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఎర్రచీర సస్పెన్స్‌

నా పేరే ఎందుకు?

ఇలా ఉంటా!

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్‌’ వివాదం

మూడోసారి తండ్రి అయిన హీరో!

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!