పులి వేటాడినట్టే!

3 Jul, 2017 00:17 IST|Sakshi
పులి వేటాడినట్టే!

పటేల్‌ ఓ పది మందిని కొడితే... అచ్చం అడవిలో జింకలను పులి వేటాడినట్టే ఉంటుంది. ఏదో క్రూరమృగం దాడి చేసినట్టు పదిమంది శవాలు చెల్లాచెదురుగా పడతాయి. అటువంటి పటేల్‌ ఓ చిన్నారి పిలిచేసరికి చిన్న పిల్లాడిలా మారతాడు. చిన్నారితో ఆటలు ఆడతాడు, ప్రేమను పంచుతాడు. ఇతడి కథను ఈ నెల్లోనే చూపిస్తామంటున్నారు దర్శకుడు వాసు పరిమి. ఆయన దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా నటించిన సినిమా ‘పటేల్‌ సార్‌’.వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి నిర్మాణ సార«థ్యంలో రజనీ కొర్రపాటి నిర్మించారు.

ఈ స్టైలిష్‌ రివెంజ్‌ డ్రామాలో జగపతిబాబు ఫస్ట్‌ లుక్‌ను శనివారం విడుదల చేశారు. సాయి కొర్రపాటి మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్‌ స్థాయిలో రూపొందిన ఈ సినిమాలో జగపతిబాబు లుక్, యాక్షన్‌ సీక్వెన్స్‌లు హైలైట్‌గా నిలుస్తాయి. వాసు పరిమి టేకింగ్‌ సూపర్‌. సినిమా ప్రారంభోత్సవం రోజున విడుదల చేసిన కాన్సెప్ట్‌ టీజర్‌ను యూట్యూబ్‌లో 27 లక్షల మంది చూశారంటే సినిమాపై ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థమవుతోంది. ఈ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. పద్మప్రియ, తాన్యా హోప్, ‘బేబీ’ డాలీ, సుబ్బరాజు, పోసాని, రఘుబాబు, ‘శుభలేఖ’ సుధాకర్, కబీర్‌ సింగ్, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వసంత్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా