శ్రీమంతుడి తండ్రి వీడియో హల్‌చల్

6 May, 2016 16:02 IST|Sakshi
శ్రీమంతుడి తండ్రి వీడియో హల్‌చల్

శ్రీమంతుడు సినిమాలో కొడుకు పాత్ర పోషించిన మహేష్ బాబు పల్లెల్లో తిరుగుతూ.. వాటి అభివృద్ధి కోసం కృషిచేసే పాత్రలో కనపడితే, అతడి తండ్రి పాత్ర పోషించిన జగపతి బాబు మాత్రం పూర్తి సూటు, బూటు వేసుకుని విమానాల్లో తిరుగుతూ పెద్ద బిజినెస్ మాగ్నెట్‌లా కనపడతారు. కానీ నిజజీవితంలో జగపతి బాబు ఏం చేస్తున్నారో తెలుసా.. పొలం దున్నుతున్నారు.

అవును.. స్వతహాగా గ్రామీణ వాతావరణం అంటే ఇష్టమున్న జగపతి బాబు ట్రాక్టర్ నడుపుతూ మరికొందరితో కలిసి పొలాన్ని దున్నుతున్నారు. ఆ వీడియోను జగ్గుభాయ్ శుక్రవారం మధ్యాహ్నం తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అప్పుడే ఆ వీడియోను దాదాపు 22వేల మంది చూసేశారు. అలాగే దానికి లైకులు కూడా బాగానే వస్తున్నాయి. ఈ వీడియోలో జగ్గుభాయ్ అచ్చతెలుగు పెద్దమనిషిలా పంచెకట్టుకుని, తలపాగా చుట్టుకుని ట్రాక్టర్ నడుపుతూ కనిపిస్తారు. కేవలం 25 సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో మీరు కూడా చూడండి..