విజయ్‌ దేవరకొండలా నిద్ర లేస్తా!

27 Nov, 2018 04:07 IST|Sakshi

అమ్మాయిల్లో విజయ్‌ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భీమవరంలో జరిగిన ‘టాక్సీవాలా’ విజయ యాత్రలో ఆయన లేడీ ఫ్యాన్స్‌ స్కూటీలతో ర్యాలీ చేసిన ఫొటోలు వైరల్‌ అవడం ఇందుకు ఒక ఉదాహరణ. విజయ్‌ క్రేజ్‌ బాలీవుడ్‌కి కూడా చేరింది. విజయ్‌తో ఓ సినిమా చేయాలని ఉందని శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌ చెప్పారు. కాఫీ విత్‌ కరణ్‌ షోలో అన్నయ్య అర్జున్‌ కపూర్‌తో కలిసి పాల్గొన్నారు జాన్వీ కపూర్‌.

ఈ షోలో ‘సడన్‌గా ఓ మేల్‌ యాక్టర్‌లా ఓ రోజు నువ్వు నిద్ర లేవాలి అనుకుంటే ఎవరిని ఊహించుకుంటావు? అని జాన్వీని కరణ్‌ జోహార్‌ అడిగితే.. ‘‘విజయ్‌దేవర కొండలా నిద్రలేచి, నాతో సినిమా చేయమని అడుగుతాను’’ అన్నారు. జాన్వీ ఇలా అనగానే ‘అర్జున్‌రెడ్డి’ అని అర్జున్‌ కపూర్‌ అన్నారు. ‘‘ఇప్పుడు ఆ సినిమా రీమేక్‌ ‘కబీర్‌సింగ్‌’ లోనే షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నాడు. విజయ్‌ సెక్సీ’’ అని కరణ్‌ అన్నారు. ఏది ఏమైనా జాన్వీ నోటి నుంచి విజయ్‌ దేవరకొండ పేరు రావడంతో తెలుగు సినిమాల్లో నటించాలని ఈ యంగ్‌ హీరోయిన్‌కి ఉందని స్పష్టం అవుతోంది. ముఖ్యంగా విజయ్‌తో జోడీ కట్టాలనుకుంటున్నారని కూడా అర్థమైంది. మరి.. జాన్వీ ఊహ నెరవేరుతుందా? వేచి చూద్దాం.

మరిన్ని వార్తలు