జై లవ కుశ.. ఆడియో వేడుక లేదట..!

30 Aug, 2017 13:23 IST|Sakshi
జై లవ కుశ.. ఆడియో వేడుక లేదట..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జై లవ కుశ. తొలిసారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు టీజర్లు సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేశాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ను సెప్టెంబర్ 3న ఘనంగా నిర్వహించాలని భావించిన చిత్రయూనిట్ ఇప్పుడు ఆ ప్రయత్నాల్ని విరమించుకున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోగణేష్ నవరాత్రుల సందడి నెలకొని ఉండటంతో ఆడియోను డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. భారీ వర్షాలతో పాటు గణేష్ నిమజ్జనం కూడా ఉండటంతో ఆడియోను డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే అభిమానుల కోసం సెప్టెంబర్ 10న  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా నిర్వహించనున్నారు. అదే రోజు జై లవ కుశ టైలర్ కూడా రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి