ఎన్టీఆర్ స్టామినా: రెండు రోజుల్లో 60 కోట్లు

23 Sep, 2017 16:51 IST|Sakshi

జై లవ కుశ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సత్తా చాటాడు. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండటం, అందులో ఒకటి నెగెటివ్ రోల్ కూడా కావటంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా భారీగా రిలీజ్ అయిన ఈ సినిమాతో తొలిరోజే రికార్డ్ కలెక్షన్లు సాధించింది. గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్ సీస్ తో కలుపుకొని తొలిరోజే 49 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది.

రెండు రోజు కూడా అదే జోరు చూపించిన జై లవ కుశ చిత్రం రెండు రోజుల్లో 60 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంది. అంతేకాదు తొలి రెండు రోజుల్లోనే ఓవర్ సీస్ లో మిలియన్ మార్క్ ను కూడా అందుకొని ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. లాంగ్ వీకెండ్ కలిసి రావటంతో తొలి వారాంతానికి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతోంది జై లవ కుశ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు