ఈ నెలాఖరున మరో టీజర్

13 Jul, 2017 11:19 IST|Sakshi
ఈ నెలాఖరున మరో టీజర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పూర్తి స్థాయి నెగెటివ్ షేడ్స్ ఉన్న జై పాత్రలో నటిస్తుండటంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అభిమానుల అంచనాలను మరింతగా పెంచేస్తూ ఇటీవల విడుదలైన జై టీజర్ ఆకట్టుకుంది. అభినవ రావణుడిగా ఎన్టీఆర్ లుక్స్, డైలాగ్ డెలివరీ సూపర్బ్. ముఖ్యంగా నత్తితో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్కు టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పటికే ఈ టీజర్ యూట్యూబ్ రికార్డ్స్ బద్ధలు కొడుతూ దూసుకుపోతుంది. ఈ అంచనాలను మరింత పెంచుతూ మరో టీజర్ ను రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది.

ఇప్పటికే జై పాత్రతో వావ్ అనిపించిన జూనియర్ ఈ సారి లవ క్యారెక్టర్ ను పరిచయం చేయబోతున్నాడు. జై రావణుడైతే. లవ క్యారెక్టర్ రాముడిలా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. తొలి టీజర్ ను మించే స్థాయి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో సెకండ్ టీజర్ ను రెడీ చేస్తున్నారు. ఈ నెలాఖరున లవ టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి