సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కొత్త ట్రెండ్..!

20 Aug, 2017 19:45 IST|Sakshi
సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కొత్త ట్రెండ్..!

జై లవ కుశ సినిమాను ప్రతీష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్, ప్రమోషన్ పద్ధతుల్లోనూ సరికొత్త పంథాను అనుసరిస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమా రానా ఓ కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఓ కొత్త పంథాను పరిచయం చేస్తున్నాడు.

ఇటీవల ట్యూబ్ లైట్ సినిమా రిలీజ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన ఫోటోనే ఎమోజీగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసి సరికొత్త ట్రెండ్ కు నాంది పలికాడు. తాజాగా సౌత్ స్టార్ విజయ్ తన కొత్త మెర్సల్ (తెలుగులో అదిరింది) స్టిల్ ను కూడా ఎమోజీగా రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ కూడా ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాడు.

జై లవ కుశ సినిమాలోని మూడు క్యారెక్టర్లకు సంబంధించిన మూడు ఎమోజీ ఐకాన్స్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం సుమారు 50 లక్షల దాకా ఖర్చు అయ్యిందనే సమాచారం. ఏది ఏమైనా టాలీవుడ్‌ లో ఈ తరహా ప్రమోషన్‌ ఏ మేర వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి