పదికాలాల పాటు నిలిచిపోయేలా...

7 Jun, 2019 00:52 IST|Sakshi
మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసిన సునీల్‌తో సముద్ర తదితరులు

శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ముఖ్యతారలుగా వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జై సేన’. వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సాయి అరుణ్‌కుమార్‌ నిర్మించిన ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను, మోషన్‌ పోస్టర్‌ను నటుడు సునీల్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా వి.సముద్ర మాట్లాడుతూ– ‘‘పదికాలాల పాటు నిలిచిపోయేలా మంచి సినిమాలు తీయాలనే శివ మహాతేజ ఫిలింస్‌ బ్యానర్‌ను స్థాపించాం. ఇందులో తొలి ప్రయత్నంగా చేస్తున్న సినిమా ‘జై సేన’. నా ప్రతి సినిమాలో సామాజిక అంశాలున్నట్లే ఇందు లోనూ ఉన్నాయి.

సహ నిర్మాత శిరీష్‌ రెడ్డిగారు అన్ని విషయాల్లో నాకు బ్యాక్‌బోన్‌లా నిలిచారు. జూలైలో సినిమా విడుదల చేయాలనుకుంటు న్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు కథే సూపర్‌స్టార్‌. నేను పరిచయం అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు మారకుండా అలాగే ఉన్న వ్యక్తుల్లో సముద్ర ఒకరు’’ అన్నారు సునీల్‌. ‘‘సముద్రతోనే నా జర్నీ స్టార్ట్‌ అయింది’’ అన్నారు సంగీత దర్శకుడు రవిశంకర్‌. శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్, శిరీష్‌ రెడ్డి, గోపీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు, సహ నిర్మాతలు: పి.శిరీష్‌ రెడ్డి, దేవినేని శ్రీనివాస్‌.

మరిన్ని వార్తలు