డిసెంబర్ 23న 'జై సింహా' ఆడియో

15 Nov, 2017 14:31 IST|Sakshi

వందో సినిమా తరువాత స్పీడు పెంచిన సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, ప్రస్తుతం జై సింహా సినిమాలో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన నయనతార, నాటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎం రత్నం మాటలు అందిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న జై సింహా సినిమా ఆడియోను డిసెంబర్ 23న విజయవాడలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. జై సింహా షూటింగ్ పూర్తయిన వెంటనే తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు బాలకృష్ణ.

మరిన్ని వార్తలు