20 Jan, 2018 12:56 IST|Sakshi

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో జై సింహా మంచి విజయం సాధించటంపై చిత్రయూనిట్ ఆనందంగా ఉన్నారు. వరుసగా సంక్రాంతి బరిలో సత్తా చాటుతున్న నందమూరి బాలకృష్ణ జై సింహాతో మరోసారి సంక్రాంతి స్టార్‌ గా ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా సినిమాలో బ్రాహ్మణులకు సంబంధించి బాలకృష్ణ చెప్పిన డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బ్రాహ్మాణులు హైదరాబాద్‌ లో జరిగిన కార్యక్రమంలో బాలయ్యతో సహా చిత్రయూనిట్‌ ను అభినందించారు.

తాజాగా బాలకృష్ణ అభిమానులు అనంతపురంలోని గౌరీ థియేటర్‌లో పురోహితుల కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ షోకు అభిమాన సంఘం నాయకులతో పాటు చిత్ర  హీరోయిన్‌ హరిప్రియ హజరయ్యారు. జనవరి 12 రిలీజ్ అయిన జై సింహా ఇప్పటి మంచి వసూళ్లును సాధిస్తోంది.

మరిన్ని వార్తలు