టైటిల్‌ గమ్మత్తుగా ఉంది

19 May, 2018 06:38 IST|Sakshi
రవికుమార్‌ రెడ్డి, సంతోష్, మురళీకృష్ణ, రాశీఖన్నా, శ్రీనివాసరెడ్డి

రాశీ ఖన్నా

‘జంబలకిడి పంబ’ టైటిల్‌ చాలా గమ్మత్తుగా ఉంది. గోపీసుందర్‌ మ్యూజిక్‌ అంటే నాకు ఇష్టం. ‘మదిలో ఉన్న ప్రేమ’ పాట చాలా బాగుంది. శ్రీనివాసరెడ్డికి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి’’ అని కథానాయిక రాశీఖన్నా అన్నారు. శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి ఎన్‌. నిర్మించారు. ఈ చిత్రంలోని తొలి పాట ‘మదిలో ఉన్న ప్రేమ’  లిరికల్‌ వీడియోను రాశీఖన్నా శుక్రవారం విడుదల చేశారు. మురళీకృష్ణ మాట్లాడుతూ–‘‘మా చిత్ర కథకు చక్కగా సరిపోయే టైటిల్‌ ‘జంబలకిడి పంబ’. టైటిల్‌ చూసి సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కథ, స్క్రీన్‌ప్లే బాగా కుదిరాయి. శ్రీనివాసరెడ్డి కెరీర్‌లో ఈ సినిమా కీలకం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో కామెడీ ఎంత బావుంటుందో, పాటలు కూడా అంతే బావుంటాయి’’ అన్నారు శ్రీనివాసరెడ్డి. ‘‘రొమాంటిక్‌ కామెడీ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుంది. జూన్‌ 14న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: సతీశ్‌ ముత్యాల, సహ నిర్మాత: బి.సురేశ్‌ రెడ్డి, లైన్‌ ప్రొడ్యూసర్‌: సంతోష్‌.

మరిన్ని వార్తలు