టైటానిక్‌ను ముంచేశారు

10 May, 2019 03:15 IST|Sakshi
జేమ్స్‌ కామెరూన్‌

... అవును ‘అవెంజర్స్‌’ సూపర్‌ హీరోస్‌ ‘టైటానిక్‌’ (1997)ను ముంచేశారు. ఈ విషయాన్ని టైటానిక్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌నే స్వయంగా చెప్పారు. ‘అవెంజర్స్‌’ ఫ్రాంౖచైజీలో ఇటీవల విడుదలైన ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ సినిమా బాక్సాఫీస్‌ను దుమ్ము రేగ్గొట్టి కొత్త రికార్డులను సృష్టిస్తోంది. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘టైటానిక్‌’ సినిమా రికార్డులను ఈ చిత్రం దాటేసింది. ఈ విషయంపై జేమ్స్‌ కామెరూన్‌ స్పందిస్తూ... ‘‘కెవిన్‌ ఫీజ్‌ (నిర్మాత, మార్వెల్‌ సంస్థ అధినేత) అండ్‌ అవెంజర్స్‌ టీమ్‌.. వాస్తవంలో ఓ మంచుకొండ నిజమైన టైటానిక్‌ షిప్‌ను ముంచేసింది.

కానీ నా ‘టైటానిక్‌’ను మీ అవెంజర్స్‌ టీమ్‌ ముంచేశారు. లైట్‌స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలో భాగస్వాములైన మేమంతా మీ విజయానికి సెల్యూట్‌ చేస్తున్నాం. సినిమా పరిశ్రమ మరింత ప్రగతిపథంలో ముందుకు వెళ్తోందని మీరు నిరూపించారు’’ అని అన్నారు. అలాగే ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన జేమ్స్‌ కామెరూన్‌ ‘అవతార్‌’ (2009) కలెక్షన్స్‌ని కూడా ‘అవేంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ దాటేస్తుందని కొందరు ట్రేడ్‌  విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ‘అవతార్‌’ సీక్వెల్‌ ‘అవతార్‌ 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు జేమ్స్‌ కామెరూన్‌. ఈ చిత్రం 17 డిసెంబరు 2021న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు