విమాన ప్రమాదంలో సంగీత దర్శకుడి మృతి

23 Jun, 2015 12:10 IST|Sakshi
విమాన ప్రమాదంలో సంగీత దర్శకుడి మృతి

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు, ఆస్కార్ విజేత జేమ్స్ హోర్నర్ (61) విమాన ప్రమాదంలో మరణించారు. సోమవారం శాంటా బార్బరా వద్ద ఈ ప్రమాదం జరిగింది. సూపర్ హిట్ చిత్రం 'టైటానిక్'కు హోర్నర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు.  అవతార్, బ్రేవ్హర్ట్, ఏ బ్యూటిఫుల్ మైండ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు హోర్నర్ సంగీత దర్శకులుగా పనిచేశారు.

శాంటా బార్బరాకు 60 మైళ్ల దూరంలో హోర్నర్ ప్రయాణిస్తున్న విమానం కూలినట్టు అధికారులు తెలిపారు. విమానానికి ఆయనే ఫైలట్. హోర్నర్ సొంత అవసరాల కోసం చిన్నపాటి విమానాన్ని కొనుగోలు చేశారు. హోర్నర్ మరణించిన విషయాన్ని ఆయన అసిస్టెంట్ సిల్వియా ధ్రువీకరించారు. ఓ అద్భుతమైన వ్యక్తిని కోల్పోయామని ఫేస్బుక్లో పేర్కొన్నారు.