జననీ విత్‌ ఫైవ్‌

22 Jan, 2017 02:21 IST|Sakshi
జననీ విత్‌ ఫైవ్‌

మలయాళంలో మంచి క్రేజ్‌ ఉన్న నటి జననీఅయ్యర్‌. ఆ మధ్య తమిళంలో అవన్  ఇవన్  లాంటి చిత్రాలతో మంచి నటనను ప్రదర్శించి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడుకు తెగిడి చిత్రం మంచి విజయాన్ని అందించింది. అయితే మలయాళంలో బిజీ కావడంతో కోలీవుడ్‌కు చిన్న గ్యాప్‌ వచ్చింది. తాజాగా ఐదు చిత్రాలతో కోలీవుడ్‌ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ ఐదు చిత్రాల నిర్మాణం వివిధ దశల్లో ఉందంటున్న జననీ అయ్యర్‌ నటించిన అదేకంగళ్‌ చిత్రం ముందుగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీని గురించి జననీ తెలుపుతూ అదేకంగళ్‌ చిత్రంలో సాధన అనే యువతిగా పాత్రికేయురాలి పాత్రలో నటిస్తున్నానని చెప్పారు.

నటి శివద సేల్స్‌గర్ల్‌ పాత్రలో మరో హీరోయిన్ గా నటిస్తున్నారని, కలైయరసన్  హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీగా ఉంటుందన్నారు. సంగీతదర్శకుడు జిబ్రాన్  సంగీతం అంటే తనకు చాలా ఇష్టం అని, ఆయన సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇందులో ఐదు పాటలు ఉంటాయని చెప్పారు. నవ దర్శకుడు రోహిన్  ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారని, ఆయనకిది తొలి చిత్రం అయినా మంచి అనుభవం ఉన్న దర్శకుడిలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని అన్నారు. అదేకంగళ్‌ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. కాగా ఈ బ్యూటీ జై కు జంటగా బెలూన్ , అశ్విన్ కనుమను సరసన తొలైకాచ్చి, రమీజ్‌రాజాతో విధి మది ఉల్టా చిత్రాల్లో నటిస్తున్నారు.