బిర్యానీ కావాలా బాబూ?

14 Oct, 2019 04:57 IST|Sakshi

ఆదివారం కావడంతో రొటీన్‌కు భిన్నంగా షూటింగ్‌ లొకేషన్‌కు కాకుండా వంట గదిలోకి అడుగుపెట్టారు జాన్వీ కపూర్‌. సుదీర్ఘంగా ఆలోచించి వెజిటబుల్‌ బిర్యానీ చేయడానికి సిద్ధమయ్యారు. వెంటనే రెసిపీని ఫాలో అవుతూ రెడీ చేసేశారు. సందేహాలు వచ్చినప్పుడు బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ భార్య మీరా రాజ్‌పుత్‌ సహాయం తీసుకున్నారు. జాన్వీ చేసిన ఈ వెజిటబుల్‌ బిర్యానీని మీరాతో పాటు, ఇషాన్‌ కట్టర్, షాహిద్‌కపూర్‌ కూడా రుచి చూశారట. వీరందరూ కలిసి ఆదివారం బ్రంచ్‌ చేశారు. జాన్వీ చేసిన వెజిటబుల్‌ బిర్యానీని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు మీరా రాజ్‌పుత్‌. ‘‘రెడ్‌ రైస్‌ వెజిటబుల్‌ బిర్యానీ చేసిన జాన్వీ కపూర్‌ను మెచ్చుకోవాల్సిందే’’ అని పేర్కొన్నారు మీరా. ఇక జాన్వీ కెరీర్‌ విషయానికి వస్తే.. ‘గుంజన్‌ సక్సెనా: ది కార్గిల్‌గాళ్‌’, ‘రూహి అఫ్జా’ సినిమాలతో పాటు ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ అనే ఆంథాలజీలో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు