వార్‌కి రెడీ

9 Dec, 2018 03:31 IST|Sakshi

యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నారట జాన్వీ కపూర్‌. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ మహిళా పైలెట్‌ గున్‌జన్‌ సక్సేనా కార్గిల్‌ యుద్ధంలో ప్రతిభ చాటారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆమె జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా రూపొందనుందని బాలీవుడ్‌ సమాచారం. టైటిల్‌ రోల్‌లో జాన్వీ కపూర్‌ నటించనున్నారట. సక్సేనా జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలను తెలుసుకునే పనిలో పడ్డారట జాన్వీ.

తొలిచిత్రం ‘ధడక్‌’లో గ్లామర్‌గా నటించిన ఆమె ఈ చాలెంజింగ్‌ పాత్రలో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పిస్తారనే విషయం బాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ ఓ కీలక పాత్ర చేయనున్నారని వినికిడి. జాన్వీని వెండితెరకు పరిచయం చేసిన కరణ్‌ జోహార్‌ ఈ సినిమాని కూడా నిర్మించనున్నారట. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ సినిమా కంటే ముందు కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహించనున్న ‘తక్త్‌’ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు జాన్వీ.

మరిన్ని వార్తలు