సెలబ్రిటీ సిస్టర్స్‌ పోస్ట్‌కు నెటిజన్ల ఫిదా

20 Dec, 2019 15:53 IST|Sakshi

న్యూఢిల్లీ : సెలబ్రిటీ సిస్టర్స్‌ తమ మధ్య ఉన్న ఆప్యాయతలను చాటుకుంటూ తమ ఎమోషనల్‌ బాండింగ్‌ ఏపాటిదో తెలుపుతూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. శ్రీదేవి, బోనీకపూర్‌ల ముద్దుల తనయలు ప్రతి సందర్భంలోనూ తమ మధ్య అనుబంధాన్ని సోషల్‌ మీడియాలో చాటుతుంటారు. ఇక ఉన్నత విద్య కోసం సెప్టెంబర్‌లో న్యూయార్క్‌కు వెళ్లిన జాన్వీ కపూర్‌ చిట్టి చెల్లెలు ఖుషీ కపూర్‌ క్రిస్‌మస్‌ హాలిడే గడిపేందుకు ముంబైలోని తమ ఇంటికి చేరుకుంది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బోనీ కపూర్‌ తన కుమార్తెను రిసీవ్‌ చేసుకుని ఇల్లు చేరారో లేదో జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫైనల్లీ అనే క్యాప్షన్‌తో ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. ఖుషీని పట్టరాని ఆనందంతో జాన్వీ హగ్‌ చేసుకుంటున్న ఫోటోలు కనిపించాయి. తన అక్కను చాలారోజుల తర్వాత కలుసుకున్న సంతోషంతో ఖుషీ జాన్వీపై వాలిపోయింది. న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో ఖుషీ మూవీకి సంబంధించిన కోర్సు అభ్యసిస్తోంది. కోర్సు ముగిసిన అనంతరం బాలీవుడ్‌లో ఆమె ఎంట్రీ ఇవ్వనున్నారు. ఖుషీ 20వ పుట్టిన రోజున సైతం జాన్వీ ఉద్వేగంగా రియాక్టరయ్యారు. ‘నిన్ను చాలా మిస్‌ అవుతున్నా.. నువ్వే నా ప్రాణ’మంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా లాక్‌డౌన్‌: చిరు బాటలో నాగ్‌

శేష జీవితాన్ని ఇలా గడిపేస్తా: రేణుదేశాయ్‌

కరోనా: దూర‌ద‌ర్శ‌న్‌లో మ‌ళ్లీ షారుక్‌

‘ఫస్ట్‌ టైమ్‌ నెలకు 1000 రోజులు’

విశాల్‌ స్థానంలో శింబు..!

సినిమా

కరోనా లాక్‌డౌన్‌: చిరు బాటలో నాగ్‌

కరోనా: దూర‌ద‌ర్శ‌న్‌లో మ‌ళ్లీ షారుక్‌

‘ఫస్ట్‌ టైమ్‌ నెలకు 1000 రోజులు’

విశాల్‌ స్థానంలో శింబు..!

రామాయ‌ణ్ చూస్తున్నా.. మ‌రి మీరు? 

‘విశ్వాసం’ కాంబో రిపీట్‌