ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ తెలుగులో!

17 Jan, 2016 23:47 IST|Sakshi
ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ తెలుగులో!

దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిని కూడా తన అందం, అభినయంతో ఉర్రూతలూగించిన కథానాయికల్లో జయప్రద ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ప్రేక్షకులతో నీరాజనాలందుకున్న జయప్రద తన రెండో ఇన్నింగ్స్‌లో అడపా దడపా కీలక పాత్రలు చేస్తున్నారు. ‘మహారథి’ తర్వాత తెలుగులో ఆమె వేరే చిత్రాల్లో నటించలేదు. దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఓ తెలుగు చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె.
 
 పాప్‌కార్న్ స్పోర్ట్స్ ఎంటర్‌టైన్ మెంట్స్, వి.ఎస్.వి ప్రొడక్షన్స్ పతాకంపై నీరజ్‌వాలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చీరాలలో ప్రారంభమైంది. ‘‘తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొం దుతున్న ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నా. ఈ చిత్రనిర్మాత బాలగిరి నాకెప్పట్నుంచో తెలుసు’’ అన్నారు. చక్కని హాస్యం నేపథ్యంలో సాగే హారర్ మూవీ ఇదని దర్శకుడు తెలిపారు. సంగీతదర్శకుడు డబ్బూ మాలిక్ అందించిన కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆయన తనయుడు అమాల్ మాలిక్ పాటలు స్వరపరుస్తున్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి