స్కూల్‌ స్టూడెంట్‌గా...

23 Sep, 2018 06:08 IST|Sakshi
జయం రవి

సినిమా సినిమాకు డిషరెంట్‌ జానర్స్‌తో ప్రయోగాలు చేస్తుంటారు తమిళ నటుడు ‘జయం’ రవి. తాజాగా మరో ప్రయోగానికి రెడీ అయ్యారట. ప్రదీప్‌ రంగనాథన్‌ అనే నూతన దర్శకుడితో తన కొత్త సినిమా స్టార్ట్‌ చేశారు ‘జయం’ రవి. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. సంయుక్తా హెగ్డే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో స్కూల్‌ యువకుడిగా కనిపిస్తారట ‘జయం’ రవి. దాని కోసం బరువు తగ్గుతున్నారట. ఈ పాత్ర కోసం సుమారు 20 కిలోల పైనే తగ్గుతారట. ఈ నెలాఖరులో షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. ఇప్పటికే బరువు పరంగా ‘జయం’ రవి తన టార్గెట్‌ని దాదాపు చేరుకున్నారట.

మరిన్ని వార్తలు