ఆనందం తొమ్మిదింతలు!

5 May, 2019 06:00 IST|Sakshi
జయం రవి

సినిమాలో ఒకటీ, రెండు గెటప్స్‌లో కనిపిస్తేనే ఫ్యాన్స్‌కు పండగలా ఉంటుంది. అదే తొమ్మిది గెటప్స్‌లో తమ హీరో కనిపిస్తే ఆనందం తొమ్మిదింతలైనట్టే. ఇప్పుడు అలాంటి విజువల్‌ ట్రీట్‌ ఇవ్వడానికి రెడీ అయ్యారు ‘జయం’ రవి. ప్రదీప్‌ రంగనాథన్‌ దర్శకత్వంలో ‘జయం’ రవి నటిస్తున్న చిత్రం ‘కోమలి’. ఇందులో కాజల్‌ అగర్వాల్, సంయుక్తా హెగ్డే కథానాయికలు. ఈ సినిమాలో ‘జయం’ రవి దాదాపు 9 గెటప్స్‌లో కనిపించనున్నారు. ఈ విషయం గురించి దర్శకుడు ప్రదీప్‌ మాట్లాడుతూ – ‘‘ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ ఉండే కామెడీ ఎంటర్‌టైనర్‌ రూపొందిస్తున్నాం. ‘జయం’ రవిగారు పోషించే తొమ్మిది పాత్రల్లో ముఖ్యంగా 1990ల్లో గెటప్‌ హైలైట్‌గా నిలుస్తుంది’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు