బై బై జయేష్‌

8 Feb, 2020 05:18 IST|Sakshi
మనీష్‌ శర్మ, రణ్‌వీర్‌ సింగ్‌, దివ్యాంగ్‌ తక్కర్‌

పాత్ర ఎలాంటిదైనా అందులోకి సులువుగా ఒదిగిపోగలరు బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌.  తన లేటెస్ట్‌ చిత్రం ‘జయేష్‌భాయ్‌ జోర్దార్‌’ కోసం తుంటరి గుజరాతీ కుర్రాడిలా మారారు. తాజాగా ఆ పాత్రకు బై బై చెప్పారు. నూతన దర్శకుడు దివ్యాంగ్‌ తక్కర్‌ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జయేష్‌భాయ్‌ జోర్దార్‌’. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై మనీష్‌ శర్మ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా ‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్‌ షాలినీ పాండే బాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి కావడంతో ‘‘జయేష్‌ భాయ్‌ బై బై’’ అన్నారు రణ్‌వీర్‌.
 

మరిన్ని వార్తలు