గొరిల్లాతో గోల గోల!

3 Jun, 2018 04:05 IST|Sakshi
షూటింగ్‌ లొకేషన్‌లో ...

విహారయాత్రకు వెళ్లినప్పుడు అడవిలో గొరిల్లాను చూస్తే భయపడతాం. అదే జూలో చూస్తే అది ఏం చేస్తుందా? అని ఆసక్తికరంగా గమనిస్తాం. మరి... అదే గొరిల్లా సినిమాల్లో ఓ కీలక పాత్ర చేస్తే ఎలా ఉంటుంది? అనేది కొన్ని సినిమాల్లో చూశాం. ఇప్పుడు మేము మళ్లీ కొత్తగా చూపించబోతున్నాం అంటున్నారు ‘గొరిల్లా’ మూవీ టీమ్‌. డాన్‌ శాండీ దర్శకత్వంలో తమిళ యాక్టర్‌ జీవా హీరోగా నటించిన చిత్రం ‘గొరిల్లా’.

ఈ సినిమాలో తన వంతు షూటింగ్‌ను కంప్లీట్‌ చేశారీ హీరో. మరి.. ‘గొరిల్లా’ సినిమాలో నాయకా నాయికలు జీవా, షాలినీ పాండేలు గొరిల్లాతో ఏ విధంగా గోల గోల చేశారనేది థియేటర్‌లో బొమ్మపడితే కానీ తెలియదు. ఈ సినిమా షూటింగ్‌ కోసం మార్చిలో థాయ్‌లాండ్‌ కూడా వెళ్లింది చిత్రబృందం. ‘రంగం, మాస్క్‌’ వంటి డబ్బింగ్‌ సినిమాల ద్వారా జీవా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘గొరిల్లా’ను కూడా తెలుగులో విడుదల చేయాలనుకుంటున్నారట.

మరిన్ని వార్తలు