జీవాకు జంటగా నిక్కీగల్రాణి

6 May, 2017 01:43 IST|Sakshi
జీవాకు జంటగా నిక్కీగల్రాణి

నటుడు జీవా బ్యూటీ నిక్కీగల్రాణితో కలిసి కీ అంటున్నారు. నటుడు జీవాకు ఇప్పుడు ఒక మంచి విజయం చాలా అవసరం. ప్రస్తుతం ఆయన సంగిలి బుంగిలి కదవై తోర చిత్రంలో నటిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. తాజాగా మరో చిత్రంలో నటించేస్తున్నారు. దీని పేరు కీ. ఇందులో నటి నిక్కీగల్రాణి నాయకిగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ఆర్‌జే.బాలాజీ, పద్మసూర్య, రాజేంద్రప్రసాద్, సుహాసిని, మనోబాలా, మీరాకృష్ణన్‌  నటిస్తున్నారు.

ఇంతకు ముందు స్నేహం ఇతివృత్తంతో నాడోడిగళ్, క్రీడా నేపథ్యంలో ఈటీ, హర్రర్‌ కథా చిత్రంగా మిరుదన్‌ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గ్లోబల్‌ ఇన్ఫోటెయిన్‌మెంట్‌ సంస్థ అధినేత ఎస్‌.మైఖెల్‌ రాయప్పన్‌ ప్రస్తుతం శింబు హీరోగా అన్భానవన్‌ అసరాధవన్‌ అడంగాధవన్‌ చిత్రాన్ని భారీ ఎత్తున్న నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే జీవా కథానాయకుడిగా కీ చిత్రాన్ని ప్రారంభించారు. ఏప్రిల్‌ 21వ తేదీన ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు సైలెంట్‌గా మొదలయ్యాయి. ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ జరుపుకుని ఈ 20వ తేదీకీ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం ద్వారా సెల్వరాఘవన్‌ శిష్యుడు కలీస్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం, అనీష్‌ తరుణ్‌కుమార్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.