న్యూడ్‌గా కనిపించడం నా ఛాయిస్‌!

12 Mar, 2018 01:35 IST|Sakshi
జెన్నిఫర్‌ లారెన్స్‌

హాలీవుడ్‌ స్పైస్‌

‘‘చుట్టూ సినిమా టీమ్‌ ఉంది. డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ నా దగ్గరకొచ్చి, నేనప్పుడు చేస్తోన్న సీన్‌లో నేను మిస్‌ చేసిన చిన్న కరెక్షన్‌ చెబుతున్నాడు. అప్పుడు నా ఒంటి మీద బట్టలున్నట్టుగానే ఆయన నన్ను చూశాడు. నేనూ నా ఒంటి మీద బట్టలున్నట్టే భావించా. చుట్టూ ఉన్నవాళ్లంతా ప్రొఫెషనల్స్‌. నాకేం ఇబ్బంది అనిపించలేదు.’’ జెన్నిఫర్‌ చెప్పిన మాటలివి.

‘రెడ్‌ స్పారో’ సినిమాలో సందర్భానుసారం ఒక సన్నివేశంలో జెన్నిఫర్‌ న్యూడ్‌గా కనిపించింది.  ‘‘సినిమా కథ ప్రకారం, ఆ పాత్ర అప్పుడు న్యూడ్‌గా కనిపించడం అవసరం అనుకున్నా. నో చెప్పలేదు. సినిమాల్లో న్యూడ్‌గా కనిపించాలనుకోవడం నా ఛాయిస్‌. ఇక్కడ ఆ అవసరం ఉందని, చుట్టూ ఉన్నవాళ్లూ కథ గురించే ఆలోచిస్తారనే ఆ సీన్‌ చేశా..’’ అని చెప్పుకొచ్చిందామె. గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ స్పై థ్రిల్లర్‌ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకొని బాక్సాఫీస్‌ వద్ద మంచి ఓపెనింగ్స్‌ తెచ్చుకుంది.

మరిన్ని వార్తలు