సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘జెర్సీ’

16 Apr, 2019 11:13 IST|Sakshi

నేచురల్ స్టార్ నాని హీరోగా మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో పిరియాడిక్‌ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌ ట్రైలర్‌లకు మంచి స్పందన రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

తాజా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న జెర్సీకి క్లీన్‌ యు సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమాలో నాని 36 ఏ‍ళ్ల వ్యక్తిగా ఓ కుర్రాడికి తండ్రిగా నటిస్తున్నాడు. కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్‌ నానికి జోడి నటిస్తోంది. తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతమందిస్తున్న ఈ సినిమా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తలు