జియాఖాన్‌ది హత్య కాదు: సీబీఐ

2 Aug, 2016 08:37 IST|Sakshi
జియాఖాన్ (ఫైల్)

ముంబై: బాలీవుడ్ నటి జియాఖాన్ హత్యకు గురికాలేదని బాంబే కోర్టుకు సీబీఐ తెలిపింది. నిందితుడు సూరజ్ పంచోలిని కాపాడాల్సిన అవసరం తమకు లేదని అడిషనల్ సొలిసిటరల్ జనరల్ అనిల్ సింగ్.. జస్టిస్ ప్రకాశ్ నాయక్, జస్టిస్ నరేశ్ పాటిల్ తో కూడిన డివిజన్ బెంచ్ కు స్పష్టం చేశారు. ఇంట్లోకి చొరబడిన దుండగుడు జియాను హత్య చేశాడని చేస్తున్న ఆమె తల్లి రాబియా ఖాన్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 23కు వాయిదా వేసింది.

జియాఖాన్ 2013, జూన్ 3న తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తెను ఆమె ప్రియుడు సూరజ్ హత్య చేశాడని జియా తల్లి రాబియా ఆరోపించారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. 2015, డిసెంబర్ లో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. జియా ఆత్మహత్యకు సూరజ్ కారణమని చార్జిషీట్ లో పేర్కొంది. అయితే కసులో కీలక ఆధారాలను సీబీఐ విస్మరించిందని ఆరోపిస్తూ రాబియా ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.