సంఘమిత్రకు ముందు సందడి

6 Nov, 2017 01:58 IST|Sakshi

కలకలప్పు... అంటే సందడి అని అర్థం. ఇప్పుడు డైరెక్టర్‌ సుందర్‌ .సి అండ్‌ టీమ్‌ సందడి సందడి చేస్తున్నారు. ఇంతకీ సుందర్‌ ఎవరో కాదు. రజనీకాంత్‌ హీరోగా వచ్చిన హిట్‌ మూవీ ‘అరుణాచలం’కి దర్శకుడు. ఆ తర్వాత ఆయన ఎన్నో హిట్‌ చిత్రాలు తీశారు. గతేడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అరణ్‌మణై–2’ తెలుగులో ‘కళావతి’ పేరుతో విడుదలైంది. ఇప్పుడు ఆల్మోస్ట్‌ 250కోట్ల బడ్జెట్‌తో దిశా పాట్నీ, జయం రవి, ఆర్య లీడ్‌ రోల్స్‌లో తేనాండాళ్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే ‘సంఘమిత్ర’ చిత్రానికి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారు సుందర్‌. ఈ సినిమా స్టార్ట్‌ కావడానికి ఇంకా టైమ్‌ ఉంది. ఈ సినిమా వచ్చే లోపు సుందర్‌ .సి నుంచి ‘కలకలప్పు 2’ వస్తుంది. 2012లో ఆయన తెరకెక్కించిన హిట్‌ మూవీ ‘కలకలప్పు’కు సీక్వెల్‌ ఇది. జీవ, జై, శివ, క్యాథరిన్, నిక్కీ గల్రానీ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రజెంట్‌ వారణాసిలో జరుగుతోంది. ‘సంఘమిత్ర’ షూట్‌ను డిసెంబర్‌లో ప్రారంభించాలనుకుంటున్నారట. ఆ లోపు ‘కలకలప్పు 2’ని  కంప్లీట్‌ చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు