జేయల్‌ఈ ప్రత్యేకత అదే

2 Dec, 2018 02:31 IST|Sakshi

సినిమా మారుతోంది. మూకీ సినిమా నుండి టాకీ సినిమా వచ్చాక ఒక్కో దశాబ్దంలో ఒక్కో విధంగా సినిమా మారుతూనే ఉంది. టూరింగ్‌ టాకీస్‌లో కదిలే బొమ్మని చూసి ప్రేక్షకులు ఆనందించారు. టూరింగ్‌ టాకీస్‌ నుంచి థియేటర్‌కి వచ్చింది సినిమా. సింగిల్‌ థియేటర్‌ నుంచి ఒకే కాంపౌండ్‌లో మల్టీ థియేటర్స్‌ వచ్చాయి. హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్‌ నిర్మాణం ఓ అద్భుతంలా చూశాం మనమందరం. ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ తర్వాత హైదరాబాద్‌లో బోల్డన్ని మల్టీప్లెక్స్‌లు వెలిశాయి.

తాజాగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, ఏషియన్‌ సినిమాస్‌ కలిసి ఏర్పాటు చేసిన ‘ఏఎమ్‌బి సినిమాస్‌’ నేడు ఆరంభం కానుంది.  అలాగే  జిల్లాల్లోని ముఖ్య నగరాలన్నింటిలో ఇప్పుడు రకరకాల మల్టీప్లెక్స్‌లు వస్తున్నాయి.   ఇప్పుడు అదే కోవలోకి వస్తోంది గుంటూరులోని జేయల్‌ఈ సినిమాస్‌. గ్రౌండ్‌ లెవల్‌ పార్కింగ్‌తో పాటు సినిమా స్క్రీన్లన్నీ కూడా కిందనే ఉండటం జేయల్‌ఈ సినిమాస్‌ స్పెషల్‌.. విశాలమైన 4 ఎకరాల్లో దాదాపు 40000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు స్క్రీన్‌లతో పాటు, పిల్లల కోసం అతి పెద్ద గేమింగ్‌ జోన్‌ను ఏర్పాటు చేశారు జేయల్‌ఈ సినిమాస్‌ అధినేత రాము పొలిశెట్టి.

ఈ రోజుతో రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపకల్పన అయిన ఈ థియేటర్‌లో అన్ని స్క్రీన్‌లు యస్‌యమ్‌పీటీఈ అండ్‌ టీహెచ్‌ఎక్స్‌ స్టాండర్డ్‌లో ఉంటాయి. ఇక్కడ అన్ని స్క్రీన్లలో 4కే ప్రొజెక్షన్‌తో పాటు, డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ సిస్టమ్‌ ఉంటుంది.  ఈ థియేటర్స్‌లో ఓన్లీ శాకాహారం మాత్రమే అందించడం ఓ విశేషం అని రాము తెలిపారు. జేయల్‌ఈ సినిమాస్‌ ఇచ్చిన తృప్తితో త్వరలోనే విశాఖపట్నం, విజయవాడలో బ్రాంచీలను విస్తరించనున్నామని కూడా అన్నారు.

మరిన్ని వార్తలు