హిందీలోకి అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌

27 May, 2020 00:00 IST|Sakshi

ఈ ఏడాది మలయాళం బాక్సాఫీస్‌ వద్ద ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రం బంపర్‌హిట్‌ సాధించింది. దాదాపు 7 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇతర ఇండస్ట్రీ నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. పృథ్వీరాజ్, బిజు మీనన్‌ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రం హిందీ రీమేక్‌ హక్కులను నటుడు, నిర్మాత జాన్‌ అబ్రహాం దక్కించుకున్నారు. ‘‘స్టోరీ, యాక్షన్, థ్రిల్‌ అంశాలను ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రంలో బాగా బ్యాలెన్స్‌ చేశారు. ఈ సినిమాని మా సంస్థ (జేఏ ఎంటర్‌టైన్మెంట్స్‌)లో రీమేక్‌ చేయబోతున్నందుకు చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు జాన్‌ అబ్రహాం. మరి.. ఈ సినిమాలో ఆయన నటిస్తారా? లేక వేరే నటుడిని నటింపజేస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఓ మాజీ హవల్దార్, ఓ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మధ్య తలెత్తే ఈగో నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ తెలుగులో కూడా రీమేక్‌ కానుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ అగ్రనిర్మాత ఈ చిత్రం రీమేక్‌ హక్కులు తీసుకున్నారని సమాచారం. మరోవైపు తమిళంలో కూడా ఓ నిర్మాత రీమేక్‌ చేయనున్నారట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా