కంగ్రాట్స్‌ బావా.., స్వామి.. : ఎన్టీఆర్‌

12 Jan, 2020 18:10 IST|Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథనాయికగా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మించారు. ఆదివారం విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటీవ్‌ టాక్‌ వచ్చింది.

చాలా గ్యాప్‌ తర్వాత వచ్చిన తమ హీరో సినిమాకు హిట్‌ టాక్‌ రావడంతో బన్నీ ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాపై సినీ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. ‘అల.. వైకుంఠపురములో’  సినిమా చాలా బాగుందంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ కితాబిచ్చాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ నటన అద్భుతంగా ఉందంటూ ట్విట్‌ చేశారు. ‘అల... వైకుంఠపురములో చిత్రం అదిరిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో మాటలు రాశారు... కంగ్రాట్స్ బావా అండ్‌ స్వామీ" అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఎన్టీఆర్‌ ట్విట్‌పై బన్నీ వెంటనే స్పందించారు. ‘బావా... థాంక్యూ వెరీ మచ్. త్వరలోనే నిన్ను కలుస్తా. నీతో మాట్లాడుతుంటే ఎంతో బాగుంటుంది’ అంటూ ట్విట్‌ చేశారు.  

(చదవండి : ‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ)

మరో ట్వీట్‌ చేస్తూ.. ‘మురళీశర్మ గారి నటనకు హ్యాట్సాఫ్. క్యారెక్టర్ రోల్ ను పండించారు. తమన్ ఇచ్చిన సంగీతం అమోఘం. ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతమే. పీఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు యావత్ చిత్ర బృందానికి అభినందనలు’ అంటూ తారక్ తన అభిప్రాయాలు వెల్లడించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా