ఎన్టీఆర్‌ అరుదైన రికార్డ్‌

14 Oct, 2018 11:03 IST|Sakshi

ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్‌ అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవర్‌సీస్‌లో కూడా మంచి జోరు చూపిస్తున్న అరవింద సమేత ఇప్పటి వరకు దాదాపు 1.7 మిలియన్‌ డాలర్ల (12 కోట్ల 50 లక్షల) వసూళ్లు సాధించింది.

అయితే ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన హీరోలు గతంలో కూడా ఉన్నారు. కానీ ఎన్టీఆర్‌ ఈ రికార్డ్‌ను వరుసగా నాలుగు సార్లు సాదించటం విశేషం. ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌, జై లవ కుశ సినిమాలు కూడా 1.5 మిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లు సాధించగా తాజాగా అరవింద సమేతతో మరోసారి అదే రికార్డ్‌‌ అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరో ఎన్టీఆరే కావటం విశేషం.

చదవండి :
‘అరవింద సమేత వీర రాఘవ‌’ మూవీ రివ్యూ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు