జూనియ‌ర్‌ ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

5 Jul, 2020 13:50 IST|Sakshi

ఇమేజ్ కోసం తాప‌త్ర‌య‌ప‌డ‌కుండా క‌థ న‌చ్చితే చాలు.. సినిమాలు చేసుకుంటూ పోయే హీరో నంద‌మూరి కల్యాణ్ రామ్‌. నేడు ఆయ‌న 42 వ ఏట అడుగు పెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా యంగ్ టైగ‌ర్‌ జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న అన్న‌య్య క‌ల్యాణ్ రామ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఆదివారం ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశారు. "కొన్ని సంవ‌త్స‌రాలుగా నువ్వు నాకు కేవ‌లం అన్న‌య్య‌గానే కాకుండా నా స్నేహితుడిగా, త‌త్వవేత్తగా‌, దిశా నిర్దేశం చేసే మార్గ‌ద‌ర్శిగా ఉంటున్నావు. హ్యాపీ బ‌ర్త్‌డే క‌ల్యాణ్ అన్నా.. నువ్వు నిజంగా గొప్ప‌వాడివి‌" అంటూ ట్వీట్ చేశారు. ప‌లువురు టాలీవుడ్ సెల‌బ్రిటీలు సైతం అత‌నికి బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. (హీరోయిన్‌కు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ వేధింపులు!)

1978 జూలై 5న క‌ల్యాణ్ రామ్ జ‌న్మించారు. నంద‌మూరి న‌ట వార‌స‌త్వం పుణికి పుచ్చుకున్న అత‌డు 1989లో "బాల గోపాలుడు" చిత్రంతో బాల‌న‌టుడిగా వెండితెరపై ప్ర‌వేశం చేశారు. అనంత‌రం "తొలి చూపులోనే" చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ త‌ర్వాత 'ల‌క్ష్మీ క‌ళ్యాణం', 'ప‌టాస్' వంటి హిట్ సినిమాలు అత‌నికి ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. అనంత‌రం తాత పేరు మీద ఎన్టీఆర్ ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీని స్థాపించి విజ‌యం సాధించారు. అత‌డు చివ‌రిసారిగా 'ఎంత మంచివాడవురా' చిత్రంలో న‌టించాడు. సంక్రాంతి బ‌రిలో దిగిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఓ మోస్త‌రు స్పంద‌న ల‌భించింది. ప్ర‌స్తుతం అత‌ను "రావ‌ణ్‌" సినిమాలో న‌టిస్తున్నాడు. (నా కల నిజమవుతోంది-ఎన్టీఆర్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా