ఆ న‌మ్మ‌కం నాకుంది: ఎన్టీఆర్‌

18 May, 2020 18:54 IST|Sakshi

ఎన్టీఆర్ బ‌ర్త్‌డేకు మ‌రో రెండు రోజులే ఉంది. మొన్న‌టి వ‌ర‌కు ఏం స‌ర్‌ప్రైజ్ ఇస్తారా? ఎలాంటి ట్రీట్ ఇస్తారా? అని ఎదురు చూసిన అభిమానుల ఆశ‌ల‌పై రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) టీమ్ నీళ్లు గుమ్మ‌రించిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టిన రోజున త‌మ వైపు నుంచి ఎలాంటి స్పెష‌ల్ ఉండ‌దని కుండ బ‌ద్దలు కొట్టిన‌ట్లు చెప్పేసింది. ఈ వార్త విన్న‌ కొంద‌రు అభిమానులు మ‌నసు చిన్న‌బుచ్చుకుంటే మ‌రికొంద‌రు చిత్ర‌యూనిట్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో అభిమానుల‌ను శాంతింప‌జేసేందుకు ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. సోమ‌వారం సాయంత్రం ట్విట‌ర్‌లో ఆయ‌న అభిమానుల కోసం ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. "ప్రియ‌మైన అభిమాన సోద‌రుల‌కు విన్న‌పం.. ఈ విప‌త్తు స‌మ‌యంలో మీరు మీ కుటుంబ స‌భ్యులు క్షేమంగా ఉన్నార‌ని భావిస్తున్నాను. అంద‌రం క‌లిసి పోరాడితే ఈ స‌మ‌స్య నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌తాం అని న‌మ్ముతున్నాను. (ఎన్టీఆర్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌..)

ప్ర‌తి ఏటా నా పుట్టిన రోజున మీరు చూపించే ప్రేమ‌, చేసే కార్య‌క్ర‌మాలు ఒక ఆశీర్వ‌చ‌నంగా భావిస్తాను. ఈ ఏడాది మాత్రం మీరు మీ ఇంటి ప‌ట్టునే ఉంటూ, అధికారుల సూచ‌న‌ల‌ను పాటిస్తూ, భౌతిక దూరానికి క‌ట్టుబ‌డి ఉండాల‌ని నా విన్న‌పం. ఇదే మీరు నాకిచ్చే అతి విలువైన బ‌హుమ‌తి. అలాగే,  ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి ఈ సంద‌ర్భంగా ఎటువంటి ఫ‌స్ట్ లుక్ లేదా టీజ‌ర్ విడుద‌ల కావ‌డం లేదు అనే విష‌యం మిమ్మ‌ల్ని తీవ్ర నిరాశ‌కు గురి చేసింద‌ని నేను అర్థం చేసుకోగ‌ల‌ను. ఫ‌స్ట్ లుక్ లేదా టీజ‌ర్ మీ ఆనందం కోసం సిద్ధం చేయాల‌ని చిత్ర బృందం ఎంత‌గా క‌ష్ట‌ప‌డింది అనేది నాకు తెలుసు. కానీ ఒక ప్రచార చిత్రం మీ ముందుకు ఉండాలంటే అన్ని సాంకేతిక విభాగాలు క‌లిసి శ్ర‌మించాలి. (భన్సాలీ చిత్రం.. ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ)

అధికారి‌క ఆంక్ష‌ల వ‌ల‌న అది కుద‌ర‌లేదు. రాజ‌మౌళి గారి ద‌ర్శ‌క‌త్వంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఒక సంచ‌ల‌నం క‌లిగిస్తుంది అన్న ‌న‌మ్మ‌కం నాకుంది. ఈ చిత్రం మిమ్మ‌ల్ని త‌ప్ప‌క అల‌రిస్తుంది. నా విన్న‌పాన్ని మ‌న్నిస్తార‌ని ఆశిస్తూ.. మీ జూనియ‌ర్ ఎన్టీఆర్" అంటూ లేఖ‌ను ముగించాడు. కాగా మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు నాడు ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్‌తో  ‘బీమ్‌ ఫర్‌ రామరాజు’ పేరిట చరణ్‌ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయ‌గా అది ఎంత‌గానో వైర‌ల్ అయింది. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా యంగ్ టైగ‌ర్ పుట్టిన‌రోజున ఎలాంటి ఫస్ట్‌ లుక్‌ గానీ, వీడియో గానీ విడుదల చేయడం లేదని చిత్ర యూనిట్ స్ప‌ష్టం చేసింది. (అందుకే ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చేలా టైటిల్‌ పెట్టాం)


 

మరిన్ని వార్తలు