ఆర్‌ఆర్‌ఆర్‌.. ఎన్టీఆర్‌ లుక్‌ అదిరిపోయింది!

6 Jul, 2019 17:57 IST|Sakshi

రాజమౌళి దర్శకుడిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమాతో టాలీవుడ్‌ స్థాయిని పెంచిన జక్కన్న.. ఇండియన్‌ మూవీ రికార్డులన్నింటిని బద్దలు కొట్టాడు. అలాంటి రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గా తీయబోతోన్న ఈ చిత్రంపై అంచనాలు ఇప్పటికే తారాస్థాయిలో ఉన్నాయి.

అయితే ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం పోరాటసన్నివేశాలను చిత్రీకరిస్తోంది. తదుపరి షెడ్యుల్‌ను అహ్మదాబాద్‌, పుణె పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యుల్‌లో అలియా భట్‌ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు పాత్రను రామ్‌చరణ్‌ పోషిస్తుండగా.. సీత పాత్రలో అలియాభట్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యుల్‌లో వీరిద్దరిపై సీన్స్‌ను షూట్‌ చేయనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఎన్టీఆర్‌ లుక్‌ను అఫీషియల్‌గా రివీల్‌ చేశారంటూ.. ఓ పోస్టర్‌ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఫ్యాన్‌ మేడ్‌ అయిన ఈ పోస్టర్‌ ఒరిజినల్‌ లుక్‌లా ఉందని ఫ్యాన్స్‌ కామెంట్స్‌, లైక్స్‌తో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా