యంగ్‌టైగర్‌ కొత్త సినిమాకు రంగం సిద్ధం

21 Mar, 2018 13:04 IST|Sakshi

సాక్షి, సినిమా : యం‍గ్‌ టైగర్‌  ఎన్టీఆర్‌ కొత్త సినిమా షూటింగ్‌కు ముహూర్తం కుదిరింది. వరుస విజయాలతో ఊపుమీదున్న యంగ్‌ టైగర్‌, జై లవ కుశ వంటి భారీ హిట్‌ తర్వాత వస్తున్న సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సినిమాలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ ఏప్రిల్ ‌12న మొదలవనుంది. ఎన్టీఆర్‌ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా.. త్రివిక్రమ్‌ మార్క్‌ కనిపించేలా స్క్రిప్ట్‌ సిద్దం చేసినట్లు సమాచారం. 

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు ఇదివరకే చిత్ర వర్గాలు తెలిపాయి. వీలైనంత తొందరగా ఈ  సినిమా పూర్తి చేయాలని చిత్ర యూనిట్‌కు ఎన్టీఆర్‌ సూచించారు. ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందు తీసుకొచ్చేలా షెడ్యూలును తయారు చేస్తున్నట్టు సమాచారం. బహుశా రాజమౌళితో నెక్ట్స్ సినిమా ఉన్నందున ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు టాలీవుడ్‌ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించనున్నాడు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా