మహానాయకుడి మాటే ఎత్తని ఎన్టీఆర్‌

26 Feb, 2019 11:58 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్‌ రెండో భాగం కూడా ఆశించిన అంచనాలు అందుకోవటంలో ఫెయిల్‌ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఈ సినిమాను కాపాడేందుకు ఒక వర్గం గట్టిగానే ప్రయత్నిస్తుందన్న టాక్‌ బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్‌, కల్యాణ్ రామ్‌లు ఒకే వేదిక మీదకు రావటంతో సినిమా జనాల్లో ఆసక్తి నెలకొంది. (చదవండి : బాబాయ్‌ స్పీచ్‌.. అబ్బాయ్‌ పాట్లు!)

యన్‌.టి.ఆర్‌ బయోపిక్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల రిలీజ్‌ సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్ అస్సలు స్పందించలేదు. కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు. కానీ మహానాయకుడు రిలీజ్‌ అయిన నాలుగు రోజుల్లోనే బాలకృష్ణ, ఎన్టీఆర్‌.. 118 సినిమా ప్రీ రిలీజ్‌ సందర్భంగా ఒకే వేదిక మీద కలుసుకోవటంతో ఎన్టీఆర్ సినిమాపై స్పందిస్తాడని నందమూరి అభిమానులు ఎదురుచూశారు.

కానీ ఎన్టీఆర్‌ మాత్రం దాదాపు ఏడు నిమిషాల ప్రసంగంలో యన్‌టిఆర్‌ బయోపిక్‌ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. కేవలం బాలయ్యకు స్వాగతం, కృతజ్ఞతలు మాత్రమే చెప్పి పూర్తిగా 118 సినిమా గురించే మాట్లాడారు. చిత్రయూనిట్‌లో ప్రతీ ఒక్కరిని పేరు పేరునా ప్రశంసించిన జూనియర్‌, బాబాయ్ సినిమా గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

మరిన్ని వార్తలు