పెద్దోడు.. చిన్నోడు...

19 Jun, 2018 00:29 IST|Sakshi
పిల్లలతో ఎన్టీఆర్‌

ఇటీవలే ఎన్టీఆర్, ప్రణతీలకు బాబు జన్మించిన విషయం తెలిసిందే. ‘‘మా ఫ్యామిలీ కొంచెం పెద్దదైంది’’ అని న్యూస్‌ బ్రేక్‌ చేసిన ఎన్టీఆర్, ఇప్పుడు బుజ్జాయి ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆ ఫొటోలో ఎన్టీఆర్‌ పెద్ద కుమారుడు అభయ్‌ రామ్‌ తమ్ముణ్ని ఒడిలో పడుకోబెట్టుకుని ఉండటం, కొడుకులిద్దర్నీ తండ్రి కెమెరాలో క్యాప్చర్‌ చేయడం చూడ్డానికి బాగుంది.  విశేషం ఏంటంటే.. కొడుకులను మురిపెంగా ఎన్టీఆర్‌ ఫొటో తీస్తుంటే, భర్త–బిడ్డలు ఉన్న ఫ్రేమ్‌ని ప్రణతి అంతే మురిపెంగా తన కెమెరాలో క్లిక్‌మనిపించారు.

‘‘మా ఇంట్లో ఉన్న బ్యాడ్‌ బాయ్స్‌ గ్యాంగ్‌కి ఇంకొకడ్ని వెల్కమ్‌ చేస్తున్నాం. ఫొటో ప్రణతీ తీసింది. మేం చేయబోయే అల్లరి ఎంతలా ఉండబోతోందో తనకి తెలియదు’’ అని పేర్కొన్నారు ఎన్టీఆర్‌. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేస్తోన్న ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రానికి కొన్ని రోజులు బ్రేక్‌ ఇచ్చారు ఎన్టీఆర్‌. బాబుకి టైమ్‌ కేటాయించడానికి గ్యాప్‌ తీసుకున్నారని సమాచారం. ఈ సినిమాను అక్టోబర్‌ 10న రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు