జనవరి 3న వస్తున్న ‘యమదొంగ’!

27 Dec, 2019 08:28 IST|Sakshi

యమదొంగ చిత్రానికి తమిళ తెరపైకి రావడానికి వేళయ్యింది. బాహుబలి చిత్రం ఫేమ్‌ ఎస్‌ఎస్‌.రాజమౌళి బాహుబలి చిత్రానికి ముందు తెలుగులో తన దర్శకత్వంలో బ్రహ్మాండంగా చెక్కిన చిత్రం యమదొంగ. టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగానూ ప్రముఖ నటుడు మోహన్‌బాబు ప్రధాన పాత్రలోనూ నటించిన ఈ చిత్రంలో నటి కుష్బూ, ప్రియమణి, మమతామోహన్‌దాస్, రంభ మేలి కలయికలో రూపొందిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందించారు. 

విజయేంద్ర ప్రసాద్‌ కథతో రాజమౌళి 2007లో తెరకెక్కించిన యమదొంగ చిత్రం కమర్శియల్‌గానూ మ్యూజికల్‌గానూ మంచి విజయాన్ని సాధించింది. సోషియో ఫాంటసీ ఇతివృత్తంతో భూలోకం, యమలోకంలో జరిగే జనరంజకంగా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో విజయన్‌ పేరుతో అనువాదమైంది. దీనికి అనువాద రచయితగా ఏఆర్‌కే.రాజా పనిచేశారు. దీన్ని తమిళంలో ఓం శ్రీసప్త కన్నియమ్మన్‌ పతాకంపై ఎం.జయకీర్తి, రేవతీ మేఘవన్నన్‌ అనువదించారు. కాగా అనువాద కార్యక్రమాలను పూర్తి చేసుకున్న  విజయన్‌ చిత్రాన్ని శ్రీ మనీశ్వర మూవీస్‌ సంస్థ విడుదల హక్కులను పొంది జనవరి 3న తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తోంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌!

సరోజినీ నాయుడుగా...

వైరసవత్తరమైన సినిమాలు

పిల్ల‌ల‌తో క‌లిసి విరాళ‌మిచ్చిన బాలీవుడ్ న‌టి

బన్నీ, ఆర్యలకు శ్రియ చాలెంజ్‌..

సినిమా

అప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌!

సరోజినీ నాయుడుగా...

వైరసవత్తరమైన సినిమాలు

తెలంగాణలో మరో 27 కరోనా కేసులు

పిల్ల‌ల‌తో క‌లిసి విరాళ‌మిచ్చిన బాలీవుడ్ న‌టి

ప్రేమ‌ప‌క్షులు..ఇప్పుడు ఇంట్లోనే ఆనందంగా