-

వినూత్న తరహాలో జంప్ జిలానీ ఆడియో ఆవిష్కరణ

1 Jun, 2014 22:41 IST|Sakshi
వినూత్న తరహాలో జంప్ జిలానీ ఆడియో ఆవిష్కరణ

 అల్లరి నరేశ్ ద్విపాత్రాభినయంలో అంబికా రాజా నిర్మించిన చిత్రం ‘జంప్ జిలానీ’. అంబికా కృష్ణ సమర్పణలో వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్-రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి ఇ. సత్తిబాబు దర్శకుడు. విజయ్ ఎజెంజర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో వినూత్న రీతిలో ఆవిష్కరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పారాచ్యూట్‌లాంటి రెండు ఎయిర్ బెలూన్స్‌లో  చిత్రబృందానికి సంబంధించిన కీలక సభ్యులు, అతిథులు నింగికి ఎగిరారు. అక్కడే మంచు మనోజ్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ ఆడియో వేడుకలో శ్రీధర్ స్వామీజీ, కె. రాఘవేంద్రరావు, రమేష్‌ప్రసాద్, మురళీమోహన్, డి. సురేష్‌బాబు, ‘దిల్’ రాజు, బెల్లంకొండ సురేశ్, లగడపాటి శ్రీధర్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
 
  ఆడియో వేదికపై నిఖిల్ సీడీని ఆవిష్కరించి ఆర్యన్ రాజేష్‌కి ఇచ్చారు. అంబికా కృష్ణ మాట్లాడుతూ - ‘‘వినూత్న పద్ధతిలో పాటలను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. మా సంస్థపై మరిన్ని మంచి సినిమాలు తీస్తాం’’ అని చెప్పారు. నాన్నగారి తరహా హాస్యం సత్తిబాబులో ఉందనీ, ఈ సినిమాని బాగా తీశాడని నరేశ్ అన్నారు. ఈ నెల 12న సినిమాని విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ నిర్వాహకుడు అంబికా రామచంద్రరావు తెలిపారు. సత్తిబాబు మాట్లాడుతూ - ‘‘తమిళంలో విజయం సాధించిన ‘కలగలప్పు’కి ఇది రీమేక్. జంప్ జిలానీ అనే పదాన్ని దాదాపు అందరూ వాడతారు. ఈ సినిమాలో కొన్ని పాత్రలు కథానుగుణంగా జంప్ అవుతుంటాయి’’ అని చెప్పారు. ఈ చిత్రంలో నటించడంపట్ల ఇషా చావ్లా, స్వాతీ దీక్షిత్ తమ ఆనందం వ్యక్తం చేశారు.