ప్యారిస్‌లో డాన్‌ లవ్‌

7 Jan, 2018 01:50 IST|Sakshi

సెంటిమెంట్స్‌ లేని సెటిల్‌మెంట్స్‌ చేస్తూ సూట్‌కేసులు అందుకుంటూ దాదాగిరి చేసుకునే డాన్‌ అతను. మూడు గన్స్, ఆరు సూట్‌కేసుల్లా అతని లైఫ్‌ సాగుతుంది. కానీ సడన్‌గా గన్‌ పక్కన పెట్టి గులాబీ పట్టుకున్నాడు. ఎందుకలా అంటే.. డాన్‌ మనసులో ప్రేమ చిగురించింది. అది ఎంత స్ట్రాంగ్‌ అంటే.. ఆ అమ్మాయి కోసం ఏకంగా ఇండియా నుంచి ప్యారిస్‌ వెళ్లాడు.

నెక్ట్స్‌ ఏమైంది అంటే.. ‘చెప్పమండి.. ఎలాగూ థియేటర్స్‌కి వస్తాంగా. చూసి, మా జుంగ లవ్‌ ఎలా ఉందో చెప్పండి’’ అంటున్నారు చిత్రబృందం. ‘కాష్మోరా’ ఫేమ్‌ గోకుల్‌ దర్శకత్వంలో ‘పిజ్జా’ ఫేమ్‌ విజయ్‌ సేతుపతి, సాయేషా, నేహా శర్మ ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న సినిమా ‘జుంగ’. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. టైటిల్‌ టీజర్‌ను శనివారం రిలీజ్‌ చేశారు. వేసవిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు