‘భరత్‌’ సభలో సందడి వాతావరణం..

7 Apr, 2018 21:36 IST|Sakshi
మహేశ్‌ బాబు, ఎన్టీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీ స్టేడియంలో ‘భరత్‌’  బహిరంగ సభ గ్రాండ్‌గా ప్రారంభమైంది.  ఈ కార్యక్రమానికి హీరో మహేశ్‌ బాబు, సూపర్‌ స్టార్‌ కృష్ణ, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, డైరెక్టర్‌ కొరటాల శివ, నటి కైరా అద్వాణీ, నటుడు ప్రకాశ్‌ రాజ్‌, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌లు హాజరయ్యారు. వీరందరూ ఒకే వరుసలో కూర్చొవడంతో సభలో సందడి వాతావరణం నెలకుంది. మహేశ్‌ అభిమానులతో ఎల్బీ స్టేడియం కిక్కిరిసిపోయింది. నటి కైరా అద్వాణీ  తెలుగులో నమస్కారం చెప్పారు. అంతేకాక హైదరాబాద్‌కి థ్యాంక్స్‌ అని అన్నారు. ఎన్నో మాట్లాడాలకుని ఇక్కడికి వచ్చాను. కానీ, ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు అని ఆమె అన్నారు. అంతేకాక షూటింగ్‌లో చేసిన ప్రయాణం చాలా స్పెషల్‌ అని నటి తెలిపారు.

కాగా, సాధారణంగా తన సినిమాలకు చీఫ్‌ గెస్ట్‌లంటూ ప్రాధాన్యం ఇవ్వని మహేష్‌.. ఫస్ట్‌ టైమ్‌ ఎన్టీఆర్‌తో స్టేజీని షేర్‌ చేసుకోవడం విశేషం. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన భరత్‌ అనే నేనుకు దేవీశ్రీప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చాడు.

మరిన్ని వార్తలు