రాక్స్టార్లా దుమ్మురేపిన ఎన్టీఆర్

11 Jan, 2016 09:30 IST|Sakshi
రాక్స్టార్లా దుమ్మురేపిన ఎన్టీఆర్

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాదు నిజ జీవితంలో కూడా చాలా ఎనర్జిటిక్గా ఉంటారని అందరూ చెప్తుంటే ఏమోగానీ ఈ వీడియో చూస్తే మాత్రం నిజమేనని ఫిక్స్ అవ్వాల్సిందే. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న నాన్నకు ప్రేమతో చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. టైటిల్ తోనే అందరినీ ఆకర్షించిన ఈ చిత్రం ప్రతి రోజూ ఏదో ఒకరూపంలో పబ్లిసిటీలో దూసుకెళ్లుతోంది. ఆ చిత్ర యూనిట్ నాన్నకు ప్రేమతో చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను, మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ చిత్ర హైప్ను మరింత పెంచేస్తుంది.

తాజాగా ఇప్పటికే అందరి నోళ్లలో నానుతున్న 'ఫాలో ఫాలో యూ' అనే పాట మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ పాటను ఎన్టీఆరే ఆలపించారు. ఈ సమయంలో యంగ్ టైగర్ ఉత్సాహం చూస్తుంటే.. ఈయన యాక్టరా లేక పాప్ సింగరా అని అనిపించేట్లుగా కనిపించారు. ఏ మాత్రం బెరుకు లేకుండా రికార్డింగ్ థియేటర్లో పక్కనే దేవీ శ్రీ ప్రసాద్ సూచనలు చేస్తుండగా అదిరిపోయే స్టైల్ తో 'ఫాలో ఫాలో యూ' అనే గీతాన్ని ఎన్టీఆర్ ఆలపించారు. పాడే సమయంలో ఎన్టీఆర్ ఉత్సాహాన్ని చూసి కుర్చీలో కూర్చోబుద్ధిగానీ దేవీ శ్రీ కూడా లేచి నిల్చోని ఎన్టీఆర్ తో జతకట్టారు. ఆ వెంటనే ఈ చిత్ర నిర్మాత బీవీఎస్ఎల్ ప్రసాద్తో కలిసి ఇద్దరూ ఫాలో ఫాలో యూ అంటూ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతూ రికార్డింగ్ థియేటర్లో సందడి చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా