మరోసారి పెళ్లి చేసుకుంటున్న బీబర్‌!

28 Sep, 2019 16:56 IST|Sakshi

హుషారెత్తించే పాటలతో పాటు, ప్రేమ వ్యవహారాలతోనూ ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు జస్టిన్‌ బీబర్‌. కెనడాకు చెందిన ఈ పాప్‌ సింగర్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌, టాప్‌ మోడల్‌ హేలీ బోల్డ్‌విన్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు బీబర్‌. ఈ సందర్భంగా పెళ్లిలో ఏ డ్రెస్‌ వేసుకోవాలో చెప్పాలంటూ అభిమానుల అభిప్రాయం కోరాడు. ఈ మేరకు... ‘పెళ్లి డ్రెస్‌ ఎంపికలో నాకు సహాయం చేయండి. ఈ ఐదింటిలో ఏ సూట్‌ బాగుందో చెప్పండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు ఫొటోలను షేర్‌ చేశాడు. ఈ క్రమంలో బీబర్‌ ఇన్‌స్టా అకౌంట్‌కు ఉన్న 119 మిలియన్ల ఫాలోవర్లలో ఎక్కువ మంది ఇంధ్రధనుస్సు రంగులతో కూడిన సూట్‌కే ఓటు వేశారు. మరికొంత మంది మాత్రం బేబీ పింక్‌ కలర్‌లో ఉన్న సూటైతే మీకు అదిరిపోతుంది బాస్‌ అని కామెంట్లు పెడుతుండగా.. ఇంకొంత మంది.. ‘ఈ డ్రెస్సులన్నీ భలేగా ఉన్నాయి. ఈ కలెక్షన్‌ ఎక్కడ దొరికింది’ అంటూ ఫన్నీగా బీబర్‌కు బదులిస్తున్నారు.

అయ్యో అసలు విషయం చెప్పలేదు కదూ.. బీబర్‌ మరోసారి పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు.. అతడి భార్యనే. అవును కొన్ని నెలల కిందట హేలీని రహస్యంగా పెళ్లి చేసుకున్న బీబర్‌ ప్రస్తుతం అట్టహాసంగా వివాహ వేడుక చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా గతంలో పాప్‌ సింగర్‌ సెలీనా గోమెజ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన బీబర్‌.. ఆమెకు పలుమార్లు బ్రేకప్‌ చెప్పినప్పటికీ ఆమెతో బంధాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో జలీనా జంట(సెలీనా గోమెజ్‌, జస్టిన్‌ బీబర్‌ జంటకు ఫ్యాన్స్‌ పెట్టుకున్న పేరు) మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రమవడంతో తాము విడిపోతున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల అంగీకారంతో తన మరో గర్ల్‌ఫ్రెండ్‌ హేలీతో నిశ్చితార్థం చేసుకున్న బీబర్‌.. ఆమెను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇక దక్షిణ కరోలినాలోని ఓ అందమైన ప్రదేశంలో ఈ జంట మరోసారి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Help me choose a tux for my wedding. It’s between these three

A post shared by Justin Bieber (@justinbieber) on

Help me choose my tuxedo for the wedding here are two more options

A post shared by Justin Bieber (@justinbieber) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమితాబ్‌ చెప్పినా చిరు వినలేదట

ఎలిమినేట్‌ అయింది అతడే!

పాల్వంచలో సినీతారల సందడి 

కల్యాణ్‌ బాబాయికి చూపిస్తా: వరుణ్‌ తేజ్‌

వరుడు వేటలో ఉన్నా!

అమలా ఏమిటీ వైరాగ్యం!

తారలు తరించిన కూడలి

అమ్మడు..కాపీ కొట్టుడు!

మనుషులా? దెయ్యాలా?

సీక్వెల్‌ షురూ

సెలవుల్లోనూ వర్కవుట్‌

జీవితం ప్రతి రోజూ నేర్పుతుంది

పదమూడేళ్లకు మళ్లీ?

కబడ్డీ.. కబడ్డీ...

నవంబర్‌ నుంచి...

అప్పుడలా.. ఇప్పుడిలా..

ఎట్టకేలకు శ్రీముఖి కోరిక తీరింది!

సైరా ప్రమోషన్స్‌.. ముంబై వెళ్లిన చిరు

రేపే ‘సామజవరగమన’

అప్పటికీ ఇప్పటికీ అదే తేడా : రాజమౌళి

గ్రెటాకు థ్యాంక్స్‌.. ప్రియాంకపై విమర్శలు!

సంచలన నిజాలు బయటపెట్టిన హిమజ

కోర్టుకు హాజరుకాని సల్మాన్‌

హిట్ డైరెక్టర్‌తో అఖిల్ నెక్ట్స్‌..!

వేణుమాధవ్‌ మృతి.. టీమిండియా క్రికెటర్‌ ట్వీట్‌

బిగ్‌బాస్‌: కెప్టెన్‌ అయ్యేదెవరు?

అల వైకుంఠపురానికి చిన్న రిపేర్‌‌..!

టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న ‘సామజవరగమన’

బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమితాబ్‌ చెప్పినా చిరు వినలేదట

‘పెళ్లికి.. ఏ డ్రెస్‌ వేసుకోవాలి’

ఎలిమినేట్‌ అయింది అతడే!

కల్యాణ్‌ బాబాయికి చూపిస్తా: వరుణ్‌ తేజ్‌

అమలా ఏమిటీ వైరాగ్యం!

అమ్మడు..కాపీ కొట్టుడు!